NOTA Votes in Indore : ఇండోర్ లోనే అత్యధిక నోటా ఓట్లు.. ఎందుకో తెలుసా?

Update: 2024-06-06 06:56 GMT

సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ అత్యధిక మెజారిటీలో చరిత్ర సృష్టించారు. ఆయన తన ప్రత్యర్థిపై 11 లక్షల 75 వేల 92 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఓట్ల మెజారిటీలోనే కాదు అత్యధిక నోటా ఓట్లు పోలైన నియోజకవర్గంగా కూడా ఇండోర్ రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ నోటాకు అత్యధికంగా 2.18 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో నామినేషన్ విత్రా చేసుకుని పార్టీకి షాక్ ఇవ్వడం సంచలనం రేపింది. దీంతో నోటాకు ఓటు వేయాలని ప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అందుకే అక్కడ నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి.

Tags:    

Similar News