Chhattisgarh train accident: బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం
8 మంది మృతి , 17 మంది పరిస్థితి విషమం
ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదానికి ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడమే కారణమని రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రయాణికుల రైలు వెనుక నుంచి గూడ్సు రైలును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.
కోర్బా జిల్లాలోని గెవరా నుండి బిలాస్‌పూర్‌కు ప్రయాణికుల రైలు వెళుతుండగా గటోరా-బిలాస్‌పూర్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కూడా అదే దిశలో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.