North rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేశారు.;

Update: 2023-07-09 07:45 GMT

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేశారు. శ్రీనగర్-జమ్మూ హైవే వెంబడి సుమారు 3 వేల వాహనాలు నిలిచిపోయాయి. సిమ్లా, సిర్మౌర్, లాహౌల్, స్పితి, చంబా, సోలన్‌లలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఏడు జిల్లాలకు "రెడ్" అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. చండీగఢ్‌లో రోజంతా వర్షం కురిస్తోంది. ఇక ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, 1982 నుండి జూలైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిస్తోంది.

Tags:    

Similar News