బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రధాని మోడీ వారసత్వం గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. మోడీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం సందర్శించడం.. దానిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కామెంట్లతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు యోగి బదులిచ్చారు. ప్రధానంగా తన రాజకీయ జీవితం గురించి కీలక వాఖ్యలు చేశారు. రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కానేకాదని, ఎప్పటికీ యోగిగానే ఉండిపోతానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రధాని పదవి రేసులో ఉంటానని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రస్తుతం యూపీ ప్రజలకు సేవ చేయడమే నా ప్రధాన కర్తవ్యం. పార్టీ అప్పగించిన బాధ్యత అదే. దాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తా" అని పేర్కొన్నారు. ఎంతకాలం రాజకీయాల్లో కొనసాగుతారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుంది. అదే విధంగా నా రాజకీయ జీవితానికీ పరిమితి ఉంటుంది అని చెప్పారు.
రాజకీయాలు.. మతం లింకులపై మాట్లాడుతూ, "మనం మతాన్ని ఒకస్థాయి వరకే పరిమితం చేస్తాం. రాజకీయాలను కొంత మందికే పరిమితం చేస్తాం. ఇందువల్లే సమస్య తలెత్తుతుంది. స్వార్ధపూరిత రాజకీయాలతో సమస్యలు వస్తాయి. సువిశాల ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మాకు మతం చెప్పేది కూడా అదే" అని సీఎం యోగి పేర్కొన్నారు. భారత ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం, మతంలో స్వార్థభావనకు తావుండదు. ఆధ్యాత్మిక భావనను జనంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయాలు కూడా ఒక వేదిక" అని చెప్పుకొచ్చారు. నాకు అన్నింటి కంటే దేశమే ఎక్కువ. ఈదేశంబాగుంటేనేనా మతం సురక్షితంగా ఉంటుంది. మతం సురక్షితంగా ఉంటేనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుంది అని చెప్పారు.