Naveen Patnaik : ముసలోడిని కాదు.. ఆరోగ్యంగా ఉన్నా.. నవీన్ పట్నాయక్ ఫైర్
తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననీ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాననీ ఒడిశా సీఎం, బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఆరోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు విశ్రాంతి ఇవ్వాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా, అమితా ఇతర బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటరిచ్చారు.
'అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దంటూ బీజేపీకి ఉండాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగిస్తూనే ఉన్నాను' అని మయూర్ భంజ్లో మీడియాతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ అన్నారు.
జనాదరణ ఉన్న ఒక ముఖ్యమంత్రిని కించపరచడాన్ని ఒడిశా ప్రజలు హర్షించరనీ.. తమ పార్టీ ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ సాధిస్తుందని మరో నేత వీకే పాండియన్ అన్నారు.