MANIPUR: మణిపుర్‌ గవర్నర్‌తో ఎంపీల భేటీ... సమస్యల వివరణ

మణిపుర్‌ గవర్నర్‌తో ప్రతిపక్ష ఎంపీల సమావేశం... ప్రజల దీనగాధలను వివరించిన ఎంపీలు..

Update: 2023-07-30 07:00 GMT

మణిపుర్‌లో పర్యటిస్తున్న ఇండియా కూటమికి చెందిన ఎంపీలు( india leaders) ఆ రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే‍( Governor Anusuiya Uikey)తో సమావేశమయ్యారు. తాము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆమెకు వివరించారు. మణిపుర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని గవర్నర్ అనసూయ ఉయికే ఎంపీలకు సూచించారు.


మణిపుర్‌కు అఖిలపక్ష బృందాన్ని పంపి అన్ని వర్గాల నేతలతో చర్చలు జరపాలని గవర్నర్‌ తమకు సూచించారని కాంగ్రెస్( Congress) లోక్‌సభ పక్షనేత అధీర్ రంజన్ ఛౌదరి( Congress MP Adhir Ranjan Chowdhury) తెలిపారు. మణిపుర్‌ ప్రజలు లేవనెత్తిన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మణిపుర్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండకడతామని అధీర్‌ రంజన్‌ చౌదరీ వ్యాఖ్యానించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించి మణిపుర్‌ అంశంపై చర్చ చేపట్టాలని అధీర్ రంజన్ ఛౌదరీ విజ్ఞప్తి చేశారు.


మణిపుర్‌(Manipur )లో జాతుల మధ్య ఘర్షణలు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీ(21 MPs)లు అన్నారు. కల్లోలిత మణిపుర్‌లో ప్రతిపక్షాల కూటమి (INDIA alliance)ఇండియాకు చెందిన ఎంపీలు.. పర్యటిస్తున్నారు. సహాయ శిబిరాల్లో బాధితులను కలిసి ధైర్యం చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. తాము రాజకీయాలు చేయడం కోసం మణిపుర్‌లో పర్యటించడం లేదని స్పష్టం చేసిన ఎంపీలు కేంద్రం కూడా ఇక్కడికి ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్‌ చేశారు.


అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫ్రంట్‌కు చెందిన ఎంపీలు స్పష్టం చేశారు. తమ పర్యటనలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా వారంతా హెలికాప్టర్‌లో చురాచాంద్‌పుర్‌కు వెళ్లారు. ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉండటంతో రెండు బృందాలుగా ఏర్పడ్డ ఏంపీలు అక్కడకు చేరుకోనున్నారు. అధీర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని బృందం ఒక సహాయ శిబిరాన్ని.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని మరో బృందం ఇంకో శిబిరాన్ని సందర్శించింది. చురాచంద్‌పుర్‌లోని పునరావాస కేంద్రాల్లోనికుకీ వర్గ ప్రజలతో ఎంపీలు మాట్లాడి వారి దీన గాధలను విన్నారు.

అన్ని పార్టీలు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలనికాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సూచించారు. మణిపుర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు. తాము మణిపుర్‌లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. సమస్యను అర్థం చేసుకోవడానికే తమ బృందం మణిపుర్‌ వచ్చిందన్న అధిర్‌ రంజన్‌ చౌదరీ హింసకు ముగింపు పలికి శాంతి స్థాపన జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 

Tags:    

Similar News