Corona Vaccine : వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డ్.. 200ల కోట్ల డోసుల పంపిణీ..
Corona Vaccine : ప్రపంచంలో జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌కు కరోనా పెద్ద చాలెంజ్ విసిరింది.;
Corona Vaccine : ప్రపంచంలో జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌కు కరోనా పెద్ద చాలెంజ్ విసిరింది. అన్ని చాలెంజ్‌లను ఎదుర్కొని ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం.. అంటే ఈ రోజు మధ్యహ్నం ఒంటిగంట వరకు 200ల కోట్ల 15వేల 631 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ వెళ్లడించింది.
దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. కరోనాని ఎదుర్కోవడంలో భారత్ ప్రపంచానికి మరో స్పూర్తిని ఇచ్చిందన్నారు. దేశంలో ఇప్పటికే 90 శాతం మందికి పైగా ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. 80 శాతం పైమంది రెండు డోసులను తీసుకున్నారు. జులై 15 నుంచి బూస్టర్ డోసును కూడా కేంద్రం ఉచితంగా అందించడం మొదలుపెట్టింది.