Rudra Brigade: మరింత పవర ఫుల్‌గా ఇండియన్ ఆర్మీ.. రుద్ర బ్రిగేడ్ ఏర్పాటు..

అసలేంటీ రుద్ర..;

Update: 2025-07-27 03:00 GMT

 ఇండియన్ ఆర్మీలో కీలక సంస్కరణలు జరుగుతున్నాయి. మన ఆర్మీ మరింత పవర్ ఫుల్ కానుంది. ఇందులో భాగంగా రుద్ర అనే పేరుతో ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ఆయుధాలతో పని చేసే బలగాలను ఒక గ్రూప్ కిందకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు కార్గిల్ విజయ్ దివస్ సంద్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ కీలక ప్రకటన చేశారు. భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.

రుద్ర కింద పదాతి దళం, మెకనైజ్‌డ్ (యాంత్రిక) పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి పోరాట భాగాలను ఏకీకృతం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత సవాళ్లు, భవిష్యతు ముప్పులను ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఏర్పాటు చేసినట్లు ద్వివేది తెలిపారు.

అలాగే బోర్డర్ లో శత్రువులను ఎదుర్కోవడానికి మరొక చురుకైన ప్రత్యేక దళాల విభాగం ‘భైరవ్’ లైట్ కమాండో యూనిట్ ను స్థాపించారు. భైరవ్ లైట్ కమాండో యూనిట్ మన బలాన్ని అనేక రెట్లు పెంచుతుందన్నారు. దేశ భౌగోళిక సరిహద్దుల వెంబడి నిరంతర ప్రతికూల వాతావరణం దృష్ట్యా స్వదేశీ క్షిపణి వ్యవస్థను అమర్చుతున్నట్టు తెలిపారు. సరిహద్దు వద్ద శత్రువును ఆశ్చర్యపరిచేందుకు ఎల్లప్పుడూ ఈ యూనిట్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక బోర్డర్ లో కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ పాక్‌కు ప్రత్యక్ష సందేశాన్ని పంపిందని, ఉగ్రవాదుల మద్దతుదారులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

“ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ఇప్పుడు డ్రోన్ ప్లాటూన్ ఉంది. ఫిరంగిదళంలో శక్తిబన్ రెజిమెంట్ ఏర్పాటు చేయబడింది. ఇది డ్రోన్, కౌంటర్-డ్రోన్ లోయిటర్ మందుగుండు సామగ్రితో అమర్చబడి ఉంటుంది. ప్రతి రెజిమెంట్‌లో ఈ వస్తువులతో కూడిన కాంపోజిట్ బ్యాటరీ ఉంటుంది. స్వదేశీ క్షిపణులతో కూడిన వాయు రక్షణ వ్యవస్థలతో దళం సన్నద్ధమవుతున్నందున రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది” అని ఆర్మీ చీఫ్ అన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాద మద్దతుదారులను వదిలేది లేదనే స్పష్టమైన సందేశాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. “ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌కు సందేశం, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందన. ఇది మొత్తం దేశానికి లోతైన గాయం” అని కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కాశ్మీర్‌లోని డ్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద జనరల్ ద్వివేది అన్నారు.

Tags:    

Similar News