పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌పై సైనిక చర్యకు రెడీ అవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల వేళ పాక్ మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 24-36 గంటల్లో తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు న్యూఢిల్లీ ప్రణాళికలు రచిస్తోందన్నారు. పాకిస్తాన్‌పై వచ్చే 24-36 గంటల్లో భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందన్నారు. దీనికి సంబంధించి పాకిస్తాన్‌కు ఖచ్చితమైన సమాచారం ఉందంటున్నారు . ఈక్రమంలోనే న్యూఢిల్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ మొసలి కన్నీరు కార్చారు. పహల్గాం దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు. అయినా సరే.. భారత్ తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ భారత ప్రధాని మోదీ వెల్లడించిన వేళ.. పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచం అంతా గమనిస్తూనే ఉంది.