Heavy rains: వరద మధ్యలో16 మంది..హెలికాప్టర్ రాకపోయ్యుంటే ఏమయ్యేదో..

Heavy rains: గుజరాత్‌లో కురిసిన కుండపోత వర్షాలకు అంబికా నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి.దాదాపు 16 మంది చిక్కుకుపోయారు.

Update: 2022-07-12 03:18 GMT

రుతుపవనాలు తీవ్రతరం కావడంతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దయింది. గుజరాత్ గజాగజా వణుకుతోంది. మరో 5 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఇక గుజరాత్ రాష్టాన్ని వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలతో పలు నగరాలు నీట మునిగాయి. ప్రధాని మోదీ సైతం గుజరాత్ పరిస్థితిపై సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేశారు. గుజరాత్‌లో కురిసిన కుండపోత వర్షాలకు అంబికా నది ఒడ్డున ఒక్కసారిగి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వదరల్లో దాదాపు 16 మంది చిక్కుకుపోయారు.

కలెక్టర్ విజ్ఞప్తి మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వారిని రక్షించారు. చేతక్‌ హెలికాప్టర్‌ ద్వారా ఆ 16 మందిని అతికష్టం మీద కాపాడారు. అక్కడ వీచిన బలమైన గాలుల కారణంగా హెలికాప్టర్‌ సైతం.. ఒడిదుడుకులకు లోనైంది. సమయానికి ఐసీజీ సహాయం అందకపోయుంటే భారీ ప్రాణనష్టం జరిగేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


Similar News