Cricketer Deepti Sharma : డీఎస్పీగా మరో భారత క్రికెటర్‌ దీప్తి శర్మ

Update: 2025-01-30 14:15 GMT

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ శర్మ ఆమెను సత్కరించారు. కాగా డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో తెలిపారు.

నిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్‌ టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.

ఇక రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్‌ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.

Tags:    

Similar News