Indian Navy : అరేబియాలో మోహరించిన ఇండియన్ నేవీ

Update: 2025-05-03 11:30 GMT

ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో తన కార్యకలా పాలను ముమ్మరం చేసింది. వార్ షిప్స్ ఉన్న మోహరించి సుదూర లక్ష్యాలను కూడా ఛేదించేలా యాంటీ-షిప్ మిసైల్ ఫైరింగ్ను విజయవంతంగా నిర్వహించింది. నౌకాదళం ఇప్పటికే గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ సూరత్, మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. వీటిలో అత్యాధునిక రాడార్, ఏఐ వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయిల్తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 70 కి.మీ దూరంలోని యుద్ధ విమానాలను కూడా సులవుగా కూల్చేయగలవు. మరోవైపు ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్ వైపు సముద్ర సరిహద్దులో తన నౌకలను మోహరించింది.

Tags:    

Similar News