Railway fare hike: రైల్వే ఛార్జీల పెంపు.. 215కి.మీ కన్నా దూరంగా ప్రయాణించే వారిపై ప్రభావం..

స్వల్పదూరాల ప్రయాణికులకు ఊరట..

Update: 2025-12-21 07:30 GMT

రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 26, 2025 నుంచి ప్రయాణికుల రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అయితే, ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రధానంగా సుదూర ప్రయాణికులపై ప్రభావం పడనుంది. అయితే, రోజూవారీ ప్రయాణికులు, స్వల్ప దూరాలు ప్రయాణించే ప్రయాణికులకు ప్రభావం ఉండదు. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులను నిర్వహించడానికి, చాలా మందికి రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రోజూవారీ ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలను పెంచింది. సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని రైల్వే ప్రకటించింది. ఈ చర్య వల్ల రోజూవారీ ప్రయాణం కోసం స్థానిక రైళ్లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. 215 కిలోమీటర్ల (కి.మీ.) దూరం వరకు జనరల్ క్లాస్ టిక్కెట్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదు. మునుపటి ఛార్జీలే వీరికి వర్తిస్తాయి. తక్కువ దూరం ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పడకుండా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఛార్జీల పెంపు ప్రభావం చూపనుంది.

* జనరల్ క్లాస్‌లో ( 215 కి.మీ దాటి ప్రయాణిస్తే), కిలోమీటర్‌కు 1 పైసా ఛార్జీ పెరుగుతుంది.

* మెయిల్, ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ రైళ్ల ఛార్జీలు కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతుంది.

* ఏసీ (అన్ని క్లాసులు)ల ఛార్జీ కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతుంది.

దీని అర్థం ఏంటంటే, కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో 500 కి.మీ. ప్రయాణానికి రూ. 10 అదనంగా ఖర్చు అవుతుంది. ఈ పెరుగుదల సుదూర ప్రాంతాల ప్రయాణికులకు కూడా కొన్ని రూపాయలు మాత్రమే పెరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. తాజా ఛార్జీల పెంపు ద్వారా రైల్వేల ఆదాయం ఏటా రూ. 600 కోట్లు పెరుగుతుంది. రైల్వేలు తమ మానవశక్తి ఖర్చు రూ.1,15,000 కోట్లకు, పెన్షన్ ఖర్చు రూ.60,000 కోట్లకు పెరిగిందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్యకలాపాల ఖర్చు రూ.2,63,000 కోట్లకు పెరిగింది. ఈ మానవశక్తి ఖర్చు పెరుగుదలను తీర్చడానికి, కార్గో లోడింగ్ మరియు ప్రయాణీకుల ఛార్జీల పెంపును పెంచడంపై దృష్టి సారించినట్లు రైల్వేలు తెలిపాయి.

గతంలో, జూలైలో రైల్వేలు ఛార్జీలనను పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి ఛార్జీలను కి.మీకి 1 పైసా పెంచారు. ఎయిర్ కండిషన్డ్ క్లాసులో ప్రయాణ ఛార్జీలు కి.మీకి 2 పైసలు పెంచారు. దీనికి ముందు, జనవరి 1, 2020న రైలు ఛార్జీలు పెరిగాయి. ఆ సమయంలో ఆర్డినరీ, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకండ్ క్లాస్ ఛార్జీలు వరసగా 1 పైస/కి.మీ. మరియు 2 పైసలు/కి.మీ.కు పెరిగాయి. స్లీపర్ క్లాస్, ఏసీ క్లాస్ ఛార్జీలు వరసగా 2 పైసలు/కి.మీ, 4 పైసలు/కి.మీ పెరిగాయి.

Tags:    

Similar News