Indiana jones : సాహసం సఫలమే

రేపు దేశ వ్యాప్తంగా విడుదల కానున్న ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ

Update: 2023-06-29 09:45 GMT

యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ను ఆస్వాదించే వారికి 'ఇండియానా జోన్స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1981లో 'రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్' తో  మొదలైన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చినవి నాలుగే సినిమాలు. అయినా సరే ఇవి ఎంతో గుర్తింపు పొందాయి. ఇక ఈ సిరీస్ లో ఆఖరి చిత్రం 'ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ' ఇప్పుడు ప్రేక్షకులను అలరించునుండి. రేపు దేశ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్ ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.

ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటివరకు ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ వచ్చింది ఈ సినిమా. సిరీస్ మొదలు పెట్టిన 14ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు ఇండియానా జోన్స్ సిరీస్ లో నాలుగు సినిమాలు వచ్చాయి, ఆ నాలుగు సినిమాలకు ప్రముఖ దర్శకులు స్టీవెన్ స్టీల్ బర్గ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు చివరిగా వస్తున్నా డయల్ ఆఫ్ డెస్టినేని మాత్రం జేమ్స్ మాన్ గోల్డ్ దర్శకత్వం వహించారు. చరిత్ర తిరిగి రాయగలిగే శక్తి కలిగిన డయల్ 'కీ' కోసం సాగే అన్వేషణ ఈ సినిమా కథ అన్న విషయం మూవీ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ కీ దొరికిన తర్వాత ఏమైంది, హిట్లర్ చేసిన తప్పులను ఎవరైనా సరిదిద్దారా ఎలా అనే విషయం ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రీమియర్ చూసిన సినీ విమర్శకులు కూడా ఇండియానా జోన్స్ సిరీస్ ని ఈ సినిమా కంప్లీట్ చేసిందనే అంటున్నారు. పాత సినిమాలను తలచుకుంటూ, కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళుతుందని చెబుతున్నారు. .

Tags:    

Similar News