దేశమంతా ఇండిగో సంక్షోభం నడుస్తోంది. వేల ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి.. లక్షల మంది ఎయిర్ పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ప్రభుత్వం, సంబంధిత శాఖ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలి దాన్ని ఎవరూ కాదనరు. రామ్మోహన్ నాయుడు కూడా బాధ్యత ఉన్న వ్యక్తిగా తన శాఖకు సంబంధించి నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఇండిగో సంక్షోభాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు అహర్నిశలు సమావేశాలు, మీటింగులు పెడుతూ కీలక ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. దేశంలో ఏ ఎయిర్ పోర్టులో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో డేటా తెప్పించుకుంటూ అక్కడ ఇండిగో ఫ్లైట్లు ఎక్కువగా నడిచేలా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈ సమస్యకు ఇండిగోనే ప్రధాన కారణం. నేడు లోక్ సభలో కూడా ఇదే విషయాన్ని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో వల్ల ఈ సమస్య తలెత్తిందని వాళ్లు రోస్టర్ విధానాన్ని కరెక్ట్ గా అమలు చేయకపోవడం వల్లే ఫ్లైట్లు క్యాన్సల్ అవుతున్నాయని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వం తప్పుగాని, డీజీసీఏ వెబ్ సైట్ తప్పుగాని ఏమీ లేదని చెప్పారు.
కానీ ఆర్నబ్ గోస్వామి లాంటి కొందరు పనిగట్టుకుని రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర విమాన శాఖ అంటే అతి పెద్దది. దాన్ని టిడిపికి చెందిన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడం వాళ్లకు బహుశా ఇష్టం లేకపోవచ్చు. వాళ్లకే కాదు మరికొందరు నేషనల్ మీడియాను నడిపిస్తున్న వాళ్లకు కూడా ఇష్టం లేక రామ్మోహన్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్థానంలో తమ వాళ్లను పెట్టాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే అర్జెంటుగా రామ్మోహన్ నాయుడుని రాజీనామా చేయించాలనే విధంగా టార్గెట్ చేస్తున్నారు..
దీనికి వైసిపి నేతలు కూడా వంత పాడుతున్నారు. తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు కూడా రామ్మోహన్ నాయుడుని తప్పు పట్టడం వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఒక బస్సు ప్రమాదం జరిగితే ఆ శాఖ మినిస్టర్ ను రాజీనామా చేయమని అంటారా, ఒక రైలు ప్రమాదం జరిగితే ఆ శాఖ మినిస్టర్ రాజీనామా చేయాలా. ఆ తప్పు ఎలా జరిగింది అది జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ శాఖ మినిస్టర్ బాధ్యత. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చేస్తున్నది కూడా అదే కదా. కాబట్టి ఈ విషయంలో ఎండికోను తప్పు పట్టకుండా రామ్మోహన్ నాయుడుని కావాలని టార్గెట్ చేయడం మానుకోవాలి.