ఇప్పుడు దేశవ్యాప్తంగా సమస్య అయిన ఇండిగో ఎలా గట్టెక్కబోతోంది అనేదే పెద్ద ప్రశ్న. ఇండియన్ ఎయిర్ మార్కెట్లో అతిపెద్ద సంస్థ ఇండిగోనే. మిగతా సంస్థలకు లేని పైలట్ల కొరత ఇండిగోకే వచ్చింది. ఇప్పుడిప్పుడే ఇండిగో తన సమస్యలను క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఇప్పటికిప్పుడు పైలట్లను ఎక్కడ నుంచి తీసుకురావడం అనేదే ఇండిగో ముందున్న పెద్ద సవాల్. ఇండిగోకు చాలా పెద్ద సంఖ్యలో పైలెట్లను రిక్రూట్ చేసుకోవాలి. లేదంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో తాత్కాలికంగా మాత్రమే బయటపడుతుంది. ఎందుకంటే డీజీసీఏ కొత్త రూల్స్ విషయంలో ఎండికోకు ఇప్పుడు తాత్కాలిక సవరణ ఇచ్చింది.
కానీ దీన్ని ఎప్పటికీ అలాగే ఉంచదు కదా. ఈ నెలాఖరులోగా ఈ తాత్కాలిక సవరణను కూడా ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి 10 నుంచి పైలట్లు, సిబ్బందికి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందే. ఆలోపు ఇప్పుడున్న సమస్యలను పర్మినెంట్ గా క్లియర్ చేసుకోవాలి ఇండిగో. ఫిబ్రవరి 10 నుంచి వచ్చే కొత్త రూల్స్ కు సరిపడా పైలట్లను కూడా ఇప్పుడే రిక్రూట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం అప్పుడు కూడా ఇలాంటి పెను సంక్షోభం తప్పేలా కనిపించట్లేదు. ఇండిగో దగ్గర ప్రస్తుతం కెప్టెన్లు, ఫస్ట్ స్టాఫ్ అధికారులతో కలిపి 5456 మంది ఉన్నారు. వీళ్లంతా పాత రూల్స్ ప్రకారం పని చేయడానికి మాత్రమే సరిపోతారు. కొత్త రూల్స్ సంపూర్ణంగా అమలు చేయాలంటే ఇంకా పెద్ద సంఖ్యలో పైరట్లు మిగతా సిబ్బంది కావాల్సిందే.
మిగతా ఎయిర్ లైన్స్ సంస్థలలో సఫీషియెంట్ గా సిబ్బంది ఉన్నారు. కానీ ఒక్క ఇండిగో దగ్గర మాత్రమే ఈ పైలెట్ల కొరత ఉంది. ఇండిగో మీద పైలట్లకు పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పని చేసుకుంటారని విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. అందుకే చాలామంది పైలెట్లు ఇండిగోను కాదని వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఇండిగో ఇప్పటికి ఇప్పుడు తన దగ్గరున్న స్టాప్ కు మంచి శాలరీలు పెంచేసి కొత్త వారిని బెటర్ జీతాలకు రిక్రూట్ చేసుకుంటేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇండియాలో కొత్తగా వస్తున్న పైలెట్లు ఇండిగోకు కావాల్సిన సంఖ్యలో లేరు. మరి దీన్ని ఇండిగో ఎలా అధిగమిస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం.