ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో భారత పర్యటనకు వచ్చారు. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత్ ఆహ్వానించగా, ఆయన కొద్దిసేపటి కిందటే ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడి రాక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తం మూడు రోజుల పర్యటనతో సుబియానాటో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు దేశాలు రాజకీయాలు, రక్షణ, భద్రత, వాణిజ్యంతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించుకోనేందుక పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా సుబియాంటో పర్యటన సందర్భంగా 3వ సీఈవో ఫోరమ్ కూడా జరగనుంది.