Indonesian President : మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు

Update: 2025-01-25 17:33 GMT

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

మొత్తం మూడు రోజుల పర్యటనతో సుబియానాటో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు దేశాలు రాజకీయాలు, రక్షణ, భద్రత, వాణిజ్యంతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించుకోనేందుక పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా సుబియాంటో పర్యటన సందర్భంగా 3వ సీఈవో ఫోరమ్ కూడా జరగనుంది.

Tags:    

Similar News