Infosys Foundation: పేద బాలికలకు ఇన్ఫోసిస్‌ చేయూత

మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.... పేద బాలికలకు స్టెమ్‌ స్టార్స్‌ పేరుతో స్కాలర్‌షిప్‌;

Update: 2023-08-18 04:45 GMT

 దేశీయ ఐటీ దిగ్గజం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌(Infosys Foundation) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. వెనకబడిన కుటుంబాలకు చెందిన బాలికల చదువుకు సహకారం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా బాలికల‍ underprivileged girl students‌కు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఇందుకోసం 100 కోట్లు( over Rs 100 crore for girl students) ఖర్చు చేయనుంది. స్టెమ్‌ స్టార్స్‌(STEM scholarship) పేరుతో ఈ స్కాలర్‌షిప్‌ను తీసుకురానుంది. ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌ ఇలా అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయల( Rs 1 lakh annually) చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సాయాన్ని అందించనుంది.


మొదటి విడతలో 2వేల మందికి పైగా బాలికల చదువుకు సాకారం ఇవ్వనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంలలో ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌( Infosys Foundation said) వారి బాధ్యతలు చూసుకుంటుంది. ఆడపిల్లల చదువు వారి పిల్లల జీవితంపై ప్రభావం చూపుతుందనీ అందుకే స్టెమ్‌ STEM (Science, Technology, Engineering, Mathematics) స్టార్స్‌ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. తొలి ఏడాదిలో ఐఐటీ, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీతో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ గుర్తింపు పొందిన ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలనుకున్న విద్యార్థులకు సహకారం అందిస్తామని అని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సుమిత్‌ విర్మనీ తెలిపారు


దేశంలోని పేద కుటుంబాల యువత తాము కోరుకున్న ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని, బాలికలపైనే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మానీ చెప్పారు. స్కాలర్‌షిప్ ప్రారంభ సంవత్సరాల్లో NIRF గుర్తింపు ఉన్న విద్యాలయాలు.. IIT లు , బిట్స్ పిలానీ, నిట్ సహా ప్రముఖ వైద్య కళాశాలల్లో చదివే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఇది కేవలం ఒక వ్యక్తికో, సమాజానికో సేవ చేయడం లాంటిది కాదనీ.. మహిళలకు విద్య ఆవశ్యకతను చెప్పేందుకు ఈ నిర్ణయమని విర్మానీ చెప్పారు. మహిళలు చదువుకుంటే.. అది వారి పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. ఇది ఎన్నో తరాల సమస్యకు పరిష్కారంగా మారుతుందని అన్నారు. అందుకే చదువు పట్ల ఉత్సాహంగా ఉన్న బాలికల కోసం స్టెమ్ స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News