దేశ ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను... ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. పంటల వైవిధ్యం, డిమాండ్ తో భారత్ ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా ఉందని వివరించారు. గత దశాబ్ద కాలంలో..... ప్రొడక్షన్-లింక్డ్ స్కీమ్ లు, మెగా ఫుడ్ పార్కులతో..... ఈ రంగం 20 రెట్లు వృద్ధి చెంది, ఎగుమతులు రెట్టింపు అయ్యాయని మోదీ తెలిపారు. దిల్లీలో..... వరల్డ్ ఫుడ్ ఇండియా 2025సమావేశంలో పాల్గొన్న ఆయన, పర్యావరణ అనుకూల "బయో-డిగ్రేడబుల్ ప్యాకేజింగ్" లో.... పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆహార గొలుసు కంపెనీల కోసం......... భారత్ తలుపులు తెరిచి ఉంచిందని, సహకారానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి....... మధ్యతరగతి పరిధిలోకి వచ్చారని., వారు ఆహార అలవాట్లను నిర్దేశిస్తారని అన్నారు. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ పై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించామని..........., 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెడ్డుబడులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో............. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు........., 9 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పసవాన్ తెలిపారు. 100 ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.