భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో మరో ఘనతను తన సొంతం చేసుకుంది. తొలి అనలాగ్ స్పేస్ మిషన్ ను లద్దాఖ్ లేహ్ లో ప్రారంభిం చింది. ఒక గ్రహంలోని మాదిరిగా పరిస్థితులను అచ్చంగా ఇక్కడ ఉండేలా చేశారు. ఫలితంగా భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఇస్రో సన్నాహాలు చేయనుంది. ఇస్రో ప్రారంభించిన తొలి భారీ అనలాగ్ మిషన్ ఇదే. హ్యూ మన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషనన్ను చేపట్టింది. మిషన్లో భాగంగా ఇస్రో లేహ్ ఓ స్పేస్ ను సృష్టిస్తుంది. ఈ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములకు సైతం శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కీలకమైన మిషన్లు చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకమైనది మిషన్ గగన్ యాన్. ఈ మిషన్లో తొలిసారి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపనున్నారు.