భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని చల్లకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి 'పుష్పక్' అనే దాని రీ యూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు.
రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్ డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్ సామర్థ్యాలను 2016లో తొలిసారిగా పరీక్షించారు. పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది.
పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది. దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది.