ITR Filing Extended : ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు

Update: 2025-05-28 08:00 GMT

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు విషయంలో ఐటీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. 20-25 సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడించింది. 2025 జులై 31తో గడువు ముగియనుండగా, సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పిచింది. ఐటీ ఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ చేయడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025-26 మందింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేస్తున్న మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను సిద్ధం చేయడానికి మరికొంత గడువు అవసరం ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్నులు ఫైల్ చేసేందుకు జులై 31తో ముగిసే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వేరుగా విడుదల చేస్తామని తెలిపింది.

Tags:    

Similar News