Jacqueline Fernandez : మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు నోటీసులు..

Jacqueline Fernandez : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది

Update: 2022-08-31 15:04 GMT

 Jacqueline Fernandez : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆమెకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 26న కోర్టు ఎదుట హాజరు కావాలని పేర్కొంది. అటు ఢిల్లీ పోలీసులు కూడా జాక్వెలిన్‌కు నోటీసులు ఇచ్చారు. సెప్టెంబర్ 12న విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై ఇటీవల ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులోనే ఇపుడు నటికి ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది.

దాదాపు 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు అభియోగం ఉంది. డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ.. ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్‌ చేసుకుంది. దోపిడీ చేసిన డబ్బు నుంచి జాక్వెలిన్‌ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News