నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) గుడ్ న్యూస్ చెప్పింది. రిక్రూట్ మెంట్ లో భాగంగా కాంట్రాక్ట్ 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రాతిపదికన 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దర ఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు ippbonline.com వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ :రూ.150
మిగిలిన కేటగిరీలు : రూ.750
అప్లికేషన్ లాస్ట్ డేట్ : 21-03-2025
ఏజ్ లిమిట్ : 21 నుంచి 35 ఏళ్ల లోపు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.)
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి.
జీతం : ప్రతి నెల రూ.30,000 చెల్లిస్తారు.