Kerala : కేరళ టూరిజం ప్రమోషన్లలో జ్యోతీ మల్హోత్రా!

Update: 2025-07-08 06:15 GMT

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా గతంలో కేరళ ప్రభుత్వం అధికారిక ఆహ్వానం మేరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. సమాచార హక్కు కింద వెల్లడైన ఓ నివేదికలో ఈ విషయం బయటపడింది. మల్హోత్రా కేరళ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పర్యాటక ప్రమోషన్ ప్రచారంలో భాగమయ్యారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో ఆ రాష్ట్ర ప్రభుత్వం టూరిజాన్ని ప్రమోట్ చేయించింది. దక్షిణాదిని పర్యాటకం పరంగా ప్రోత్సహించేందుకు అతిథులు గా ఎంపిక చేసిన 41 మంది ఇన్ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది. జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు.

Tags:    

Similar News