భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపుతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ అన్నారు. యుద్ధాన్ని ఆపే శక్తి తనకే ఉందన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లు కేఏపాల్ తెలిపారు. ఇటీవల రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న అగ్రనేతలను కలిసినట్లు చెప్పారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఎల్లుండి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత పాకిస్తాన్ వెళ్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ యుద్ధం ఆపే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సీఎం ఉన్న టైంలో 2002లో తను పాకిస్తాన్ వెళ్లినట్లు గుర్తుకు చేశారు. భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్ అసలు క్రిస్టియన్ కాదు, జగన్ చిన్నజీయర్ స్వామి భక్తుడు తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయారు. పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయాలని హైకోర్టును కోరాం.' అని కేఏపాల్ అన్నారు.