KA Paul: ఉక్రెయిన్ పరిస్థితి తలచుకుని కన్నీరు పెట్టిన పాల్.. పుతిన్‌కు మెంటల్ అంటూ..
KA Paul: ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై ప్రపంచ శాంతి దూత కె.ఎ.పాల్ స్పందించారు.;
KA Paul: ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై ప్రపంచ శాంతి దూత కె.ఎ.పాల్ స్పందించారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ మెంటలోడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు పాల్. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నానని.. పరిస్థితులను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు పాల్.
ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. తమ సైనికులను ఉక్రెయిన్‌కు పంపించాలని గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరానన్నారు పాల్. అప్పుడు ఓకే చెప్పిన బిడెన్..ఇప్పుడు వెనక్కి తగ్గారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బిడెన్ కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు.