Kamal Haasan : రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్

Update: 2025-07-25 11:00 GMT

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. డీఎంకే కూటమి మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. కాగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు కమల్ హాసన్.

ఇదిలా ఉండగా 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్... 2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో .. డీఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగు రాజ్యసభ స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంది. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News