Himachal Pradesh : సాయం చేయడానికి డబ్బులు లేవన్న కంగనా.. కాంగ్రెస్ విమర్శలు

Update: 2025-07-07 13:30 GMT

హిమాచల్ ప్రదేశ్‌లో వరద బాధితులకు సంబంధించి బీజేపీ ఎంపీ కంగనా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. బాధితులకు సాయం చేయడానికి తనవద్ద నిధులు లేదా కేంద్రం మంత్రి పదవి లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఆపద సమయాల్లో బాధితులకు భరోసా ఇవ్వాలే.. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికింది. అయితే తాను ఉన్న పరిస్థితినే వివరించానని .. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని కంగనా విమర్శించారు.

కాగా తన లోక్ సభ నియోజకవర్గంలోని తునాగ్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కంగనా పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ ‘‘ మిమ్మల్ని ఆదుకోవడానికి నా దగ్గర నిధులు లేవు. నేను క్యాబినెట్ మంత్రిని కూడా కాదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధాని మోడీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధితులను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

Tags:    

Similar News