PM Modi : శతజయంతి ఉత్సవాలకు మోదీకి ఆహ్వానం

Update: 2024-12-12 11:00 GMT

కపూర్ ఫ్యామిలీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తన తాత రాజక పూర్ శత జయంతి సందర్భంగా ప్రధానిని కలిసినట్టు కరీనా కపూర్ తెలిపారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరీనా సైఫ్ అలీఖాన్ తోపాటు అలియా భట్, రణ్ బీర్ కపూర్ తదితరులు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీ ఆటోగ్రాఫ్ తీసు కున్నారు కరీనా. తన తాత రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాలకు రావాలని ఆహ్వా నించినట్టు చెప్పారు. రాజ్కపూర్ జయంతి డిసెంబరు 14, 1924లో ఆయన జన్మించిన ఆయన 1988లో మరణించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన రాజ్కపూర్ జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ నెల 13 నుంచి 15 వరకు 'రాజ్కపూర్ 100: సెంటినరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షోమ్యాన్' పేరుతో వేడుకలు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని ప్రధానిని ఆహ్వానించింది కపూర్ ఫ్యామిలీ.ః

Tags:    

Similar News