Karnataka: ఎన్నికల హామీల అమలుకు కేబినెట్‌ నిర్ణయం

కర్నాటక కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ఐదు ప్రధాన హామీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Update: 2023-06-15 11:15 GMT

కర్నాటక కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ఐదు ప్రధాన హామీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాల సిలబస్‌లోనూ మార్పులు చేసింది. కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఐదు హామీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమావేశం సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

అన్న భాగ్య పథకం కింద బిపిఎల్ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరికీ 10 కిలోల ఉచిత బియ్యం, గృహ లక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు రెండు వేలు భత్యం, యువనిధి పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 3 వేల భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను దశలవారీగా అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. జులై 1 నుంచి అన్నభాగ్య, ఆగస్టు 15న గృహ లక్ష్మి స్కీమ్‌లను ప్రారంభిస్తామని చెప్పారు.

పాఠ్యపుస్తకాలలో స్కూల్‌ సిలబస్‌లోనూ మార్పులు చేయాలని కర్నాటక కేబినెట్ నిర్ణయించింది. కె. బి. హెడ్గేవార్‌పై ఉన్న పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం బొమ్మై సర్కార్‌ చేసిన మార్పులను సిద్దు సర్కార్‌ తిరిగి ప్రవేశపెట్టింది. పాఠశాలలు, కళాశాలల్లో శ్లోకంతోపాటు రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సిలబస్‌లో మార్పులు చేస్తున్నారని ఆరోపించింది. మైనారిటీల ఓట్ల కోసం మళ్లీ హిజాబ్‌ను ప్రవేశపెట్టినా ఆశ్చర్యం లేదన్నారు కర్ణాటక మాజీ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్.

Tags:    

Similar News