Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చాల్సిందే : ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్
డీకే శివకుమార్ ను కర్ణాటక ముఖ్యమంత్రిని చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. సీఎంగా డీకే బాధ్యతలు తీసుకోనున్నట్లు ఇటీవల పలువురు నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలు సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రాష్ట్ర ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యా రు. ఈ సమావేశానికి ముందు సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య ను తప్పించాలని, మిగిలిన పదవీ కాలానికి శివకుమార్ ను యమించాలని పార్టీ నేతలు కోరుతున్నట్లు ఇక్బాల్ చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని ఎదురుచూ స్తున్నారన్నారు. వారంతా మంచి పాలన కో రుకుంటున్నారని తెలిపారు. ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారంటున్నా రు. ఆయన చేసిన మంచి కారణంగానే ఇప్పుడు అందరూ మద్దతు తెలుపుతున్నా రని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జరిగే సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తు తానని హుస్సేన్ తెలిపారు. ఇప్పుడు మార్పు జరగకపోతే 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.