Vande Bharat Katra-Srinagar : కట్రా-శ్రీనగర్ వందేభారత్ ట్రయల్ రన్ సక్సెస్
శక్తిపీఠంగా విరాజిల్లుతున్న వైష్ణోదేవి ఆలయానికి ఇక వందే భారత్ రైల్లో వెళ్లొచ్చు. ఇవాళ శ్రీనగర్ - కట్రా మధ్య నిర్వహించిన వందే భారత్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఈ రైలు కేబుల్ బ్రిడ్జిపైనా, ప్రపంచంలోనే ఎత్తయి నదైన కాశ్మీర్ లోయలోని శీతల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్రాంతానికి కనెక్టివిటీని మెరుగుపరచ డంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుం ది. ఉత్తర రైల్వేజోన్ లో ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రారంభం అభివృద్ధికి ఒక సూచికగా నిలువనుం ది. దేశంలో ఇప్పటి వరకు 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలును చల్లని వాతావర ణానికి అనుకూలంగా ఉండేలా రూపొందించా రు. ఇందులో బయో టాయిలెట్ లోని ట్యాంకుల్లో ఉండే నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునా తన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జీరో డిగ్రీ ఉష్ణో గ్రతలోనూ సాఫీగా పనిచేసే ప్రత్యేకమైన ఎయిర్ బ్రేక్ సిస్టమ్ రూపొందించారు. కట్రా - శ్రీనగర్ - మధ్య టికెట్ ధరను ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఏసీ కార్ చైర్ చార్జీ రూ. 1500 నుంచి 1600 రూపాయల వరకు ఉటుందని, ఎగ్జిక్యూ టివ్ కార్ చైర్ కు 2,200 నుంచి 2,500 వరకు ఉండవచ్చని అంచనా.