Ashwini Vaishnaw : కవచ్‌తోనే రైలు ప్రమాదాలకు చెక్.. అశ్వనీ వైష్ణవ్

Update: 2024-08-02 09:55 GMT

రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. లోక్ సభ సమా వేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కవచ్ ఏర్పాటుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ హయంలో రైల్వే వ్యవస్థలోని లోపాలను ప్రస్తావించారు. దేశంలో నిత్యం దాదాపు 20 వేల రైళ్ల కార్యకలా పాలు జరిగేందుకు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దేశంలోని అన్ని రైల్వేల్లో కవను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 3 వేల కిలోమీటర్ల పొడవున కవచ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

Tags:    

Similar News