ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ( Arvind Kejriwal ) కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈడీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. "కేజీవాల్ బెయిల్ని వ్యతిరేకించేందుకు తమకు సరైన అవకాశం లభించలేదు. మా వాదనలు వినిపించే సరిపడా సమయమూ ఇవ్వలేదు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలి. మా పిటిషన్ పై అత్యవసర చర్యలు చేపట్టాలి..." అని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ స్టే ఇచ్చింది.
ట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ ఢిల్లీ సీఎం కేజీవాల్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి శుక్రవారం కేజీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈలోగా ఈడీ పిటిషన్ సాక్షులను వేయడం దానికనుగుణంగా హైకోర్టును స్టే ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది.
మూడు నెలల కిందట అరెస్టయిన కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దని, విచారణకు సహకరించాలని, ప్రభావితం చేయొద్దని, పిలిచినపుడు కోర్టుకు రావాలని పలు షరతులు విధించింది. ఐతే.. 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ ను నిలిపివేయాలని ఈడీ విజ్ఞప్తి చేసింది.