అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆ వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని కోరారు. అంబేడ్కర్‌ను అవమానించారని, ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, ప్రధాని మోదీ కూడా ఆయన్ను సమర్థిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.
‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.