Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్ పోటీ చేసేది ఇక్కడి నుంచే!

Update: 2024-12-16 11:45 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంది. ఇప్పటికే మూడు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా నాలుగవదైన చివరి జాబి తాను వెల్లడించారు. ఈ జాబితాలో ప్రస్తుత ముఖ్య మంత్రి అతిశీ, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పేర్లు ఉన్నాయి. ఈ జాబి తాలో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రివాల్ తన పాత స్థానమైన న్యూఢిల్లీ నుంచి బరిలో నిలుస్తుండగా.. కల్కాజీ సీటు నుంచి అతిశీ పోటీ చేయనున్నారు. గ్రేటర్ కైలాక్ స్థానంలో సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. తుది జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటి వరకు మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని వెల్లడిం చింది. 'బీజేపీ మిస్సింగ్. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదు' అంటూ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో కేజ్రివాల్ను తిట్టడం తప్ప, ఢిల్లీ కోసం బీజేపీ ఏమీ చేయలేదని కేజీవాల్ పార్టీ దుయ్యబట్టింది. ఢిల్లీ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న ఆప్కే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇలాఉండగా, 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ అధిష్ఠానం టిక్కెట్లు నిరాకరించింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు బదులుగా వారి కుటుంబ సభ్యులు నామినేట్ అయ్యారు. కృష్ణ నగర్ నుంచి ఎస్కే బగ్గా కుమారుడు వికాస్ బగ్గా, చాందినీ చౌక్ నుంచి ప్రహ్లాద్ సాహ్ని క మారుడు పురన్ దీప్ సాహ్ని, ఉత్తమ్ నగర్ నుంచి నరేష్ భార్య పూజా బల్యాన్ పోటీ చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News