Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. విచారణ మరోసారి వాయిదా

Update: 2024-08-23 09:45 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 5వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు బెయిల్ ఇవ్వడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరో వారం సమయం కావాలన్న సీబీఐ విజ్ఞప్తితో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయలేదు. ఇక, విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ.. ఉద్దేశ్యపూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందన్నారు.

Tags:    

Similar News