Kerala: కేరళలో దుమారం రేపుతున్న గోల్డ్ స్కామ్ కేసు.. సీఎం రాజీనామా చేయాలంటూ..
Kerala: కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్కామ్ కేసు పెను దుమారం రేపుతోంది.;
Kerala: కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్కామ్ కేసు పెను దుమారం రేపుతోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పినరయి విజయన్ రాజీనాయా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. తిరువనంతపురంలోని సెక్రటేరియట్ ముందు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు చేరుకుని నిరసన తెలిపారు.
వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జోరువానలోనే సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. పినరయి విజయన్ రాజీనామాల చేయాలని నినదించారు. అక్కడి నుంచి వారిని చెరదగొట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. అయినా బీజేపీ శ్రేణులు శాంతించకపోవడంతో పోలీసులు వాటర్ క్యాన్స్‌తో వాటర్ కొట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తిరువంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.