Kerala High Court : విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు సెక్సువల్ హరాస్‌మెంటే: హైకోర్టు
విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు చేయడం లైంగిక నేరం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. KSEBలోని మహిళా ఉద్యోగి పెట్టిన కేసును క్వాష్ చేయాలని మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 2013 నుంచి అతడు వల్గర్‌గా మాట్లాడుతూ అసభ్య మెసేజులు పంపిస్తూ కాల్స్ చేసేవాడు. బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు నేరం కాదని అతడు వాదించగా, మహిళ చూపిన సందేశాల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు ఏకీభవించింది. ఈ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ మహిళా స్టాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి ఆయన తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఆ తర్వాత అభ్యంతరకర మెసేజ్‌లు, వాయిస్‌కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురిచేశారని తెలిపారు. దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.