Kerala High Court: భార్యకు వంట రాకపోతే విడాకులా?
వివాహ రద్దుకు తిరస్కరించిన కేరళ హైకోర్టు;
భార్యకు వంట రానంత మాత్రాన దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తన భార్యకు వంట చేయడం రాదని, తనకు భోజనం వండిపెట్టకుండా తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నందున విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారించింది. చట్టపరంగా దంపతులైన తర్వాత అందులో ఒకరు వివాహాన్ని రద్దు చేసుకోవడానికి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని, విడాకులు కోరడానికి గల సహేతుకమైన కారణాన్ని చూపాలని ధర్మాసనం పేర్కొంది. ‘వంట చేయడం రాకపోతే అది క్రూరత్వం ఎలా అవుతుందని’ ధర్మాసనం ప్రశ్నించింది.
బాధితుడు తనకు భార్యతో విడాకులు మంజూరు చేయాలని త్రిసూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పిటిషనర్ వాదనతో ఏకీభవించకుండా వ్యతిరేకించడమే కాకుండా ఆయంతోల్‌కు చెందిన భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. వంట రాకపోవటం, 10 సంవత్సరాలు దూరంగా ఉండటం అన్న కారణాలతో విడాకులకు అంగీకరించలేమని, ఏవి కారణాలుగా చూపి విదాకులకి అనుమతించబడదని కోర్టు పేర్కొంది.
ట్టపరంగా దంపతులైన తర్వాత అందులో ఒకరు వివాహాన్ని రద్దు చేసుకోవడానికి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని, విడాకులు కోరడానికి గల సహేతుకమైన కారణాన్ని చూపాలని ధర్మాసనం పేర్కొంది. ‘వంట చేయడం రాకపోతే అది క్రూరత్వం ఎలా అవుతుందని’ ధర్మాసనం ప్రశ్నించింది.