Kerala: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజుల ముందుగానే..
Kerala: నిర్ణీత సమయం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను పలకరించాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.;
Kerala: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నిర్ణీత సమయం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను పలకరించాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భారత దేశ వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారం. ఇటీవల అసని తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదిలాయి. మరో వారం రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.