Farmers : నిరసన చేస్తున్నవాళ్లు రైతులు కాదు

Update: 2024-09-28 13:45 GMT

కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదని అన్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారు కేంద్రం, హర్యానా ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘పంజాబ్‌కు చెందిన కొందరు రైతుల వేషధారణలో తిరుగుబాటు ప్రారంభించారు. కేంద్రం, హర్యానా ప్రభుత్వాలను గద్దె దించడమే దీని వెనుక ఉద్దేశం. ఆ మారువేషంలో ఉన్న వ్యక్తులు ట్రాక్టర్లతో రాజధాని ఢిల్లీకి చేరుకుని ఎర్రకోటపై కూడా దాడి చేశారు. వారు రైతులు కాదు’ అని మీడియాతో అన్నారు. కాగా, రైతుల నిరసనపై మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందించారు. ‘ఖట్టర్‌ సీఎంగా ఉన్నంత కాలం తమకు ఒక్క సీటు కూడా రాదని బీజేపీ అర్థం చేసుకున్నది. అందుకే ఖట్టర్‌ సాహబ్‌ను సీఎం పదవి నుంచి తొలగించారు’ అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News