Kumbh Mela : కుంభమేళాతో రూ.2.80 లక్షల కోట్ల బిజినెస్

Update: 2025-04-04 08:00 GMT

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాతో దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక తెలిపింది. ఈ మేళా వల్ల రూ.2.8 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరిగినట్లు వెల్లడించింది. కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్లు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు తదితర రంగాల ద్వారా రూ.80,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. రోజూవారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపింది.

కుంభమేళా కారణంగా వివిధ రంగాల్లో భారీ వాణిజ్య లావాదేవీలు జరిగాయి. ముఖ్యంగా, కుంభమేళాలో భక్తుల విరివిగా పాల్గొనడం వల్ల రోజువారీ అవసరాల కోసం రూ.1.1 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. భక్తులు చేసిన కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయాలకు సమీపంగా ఉన్న వ్యాపార సంస్థలు, ప్రయాణికుల అవసరాలకు సంబంధించిన స్టాళ్లు, వస్త్ర, ఆహార విక్రయ దుకాణాలు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి.

Tags:    

Similar News