UP Governor : కుంభకర్ణుడు గొప్ప ఇంజినీర్..యూపీ గవర్నర్ ఆనందీబెన్ కాంట్రవర్సీ

Update: 2024-11-20 11:15 GMT

రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడి గురించి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనం దిబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయాడన్నది నిజం కాదని.. ఆ సమయంలో రహస్యంగా యంత్రాల తయారీలో నిమగ్నమయ్యాడని ఆమె అన్నారు. లక్నోలోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి భాషా యూనివర్సిటీ కాన్వోకేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

'కుంభకర్ణుడు ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు. రహస్యంగా అనేక యంత్రాలను తయారు చేశాడు. ఆ టెక్నాలజీ వేరే దేశాలకు తెలియకుండా రహస్యంగా కాపాడుకునేవాడు. రావణాసురుడే తన సోదరుడిని 6 నెలల పాటు బయటకు రాకుండా యంత్రాల తయారీలో నిమగ్నమవ్వాల్సిందిగా ఆదేశించారు. కానీ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు అంటూ బయటకు ఒక వదంతి సృష్టించారు' అని ఆనందిబెన్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Tags:    

Similar News