Kuno national park: ఆగని చీతాల మరణం..మరో రెండు కూనల మృతి

నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరొకటి మృత్యువాతపడింది.

Update: 2023-07-15 01:00 GMT

మధ్యప్రదేశ్‌ కునో నేషనల్‌ పార్క్‌లో చీతాల మరణాలు ఆగడం లేదు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరొకటి మృత్యువాతపడింది. మూడు రోజుల క్రితం మగ చీతా తేజస్ మృత్యువాతపడగా.. ఇవాళ మరో మగ చీత సూరజ్ చనిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే 8 చీతాలు మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే చీతాల మృతికి కారణాలు ఏంటన్నవి అంతుబట్టడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా కార్యక్రమంలో భాగంగా రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. వీటిలో నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా నాలుగు నెలల క్రితం మృత్యువాతపడింది. నెల రోజుల వ్యవధిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చీతా ఉదయ్... ఆడ చీతా దక్ష మృత్యువాతపడ్డాయి. అదే నెలలో జ్వాల అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోయాయి. ఈ నెలలో రెండు మరణాలతో కలిపి.. మొత్తం 4 నెలల వ్యవధిలో చీతాల మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Tags:    

Similar News