Rahul Gandhi-Kharge : ఐక్యతను చాటుదాం.. మోదీకి రాహుల్, ఖర్గే లేఖ

Update: 2025-04-29 11:45 GMT

పహెల్గాం ఉగ్రదాడి నేప థ్యంలో యావత్ భారత దేశం ఒక్కటేనని ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్ల మెంటు సెషన్ పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు వీ రిద్దరూ వేర్వేరుగా ప్రధానికి లేఖ రాశారు. ఈ నెల 22న పహెల్గాంలో అమాయక పౌరులపై క్రూరమైన ఉగ్రదాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపా ల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమష్టి సంకల్పానికి ఇది మరింత శక్తినిస్తుందని లేఖలో ప్రస్తావిం చారు. అది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడే ప్రజా ప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరని అన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నా మని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నా రు. ఇదిలా ఉండగా .. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జర గాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News