రాజకీయాలను పరిశుద్ధం చేస్తానని, అవినీతి లేకుండా చేస్తానన్న ఆప్ సారథి అరవింద్ కేజ్రివాల్ మాట నిలబెట్టుకోలేదని ఫైరయ్యారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన చివరకు లిక్కర్ స్కామ్ నిర్మాతగా, శీష్ మహల్ దందాకు నాయకుడిగా మిగిలిపోయారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తో కటీఫ్ చెప్పి ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ తర పున ప్రతాపంజ్లో రాహుల్ మంగళవారంనాడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేజీవాల్, మనీష్ సిసోడియాలపై తీవ్ర విమర్శలు చేశారు.