Rape Case: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి పై పోలీసుల కాల్పులు..

మరోవైపు బాలిక పరిస్థితి విషమం

Update: 2025-11-28 02:45 GMT

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని గౌహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన  ఆ  రాష్ట్ర ప్రజలని  ఆగ్రహానికి గురిచేసింది. నవంబర్ 21వ తేదీ శుక్రవారం రాత్రి, ఓ కామాంధుడు బాలికపై అత్యాచారాని ఒడిగట్టాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు సల్మాన్ అలియాస్ నాజర్‌ను అరెస్టు చేశారు. భోపాల్‌లోని గాంధీనగర్‌లో అరెస్టు చేసిన.. రైసెన్‌కు తరలిస్తుండగా కిరాత్ నగర్ గ్రామం సమీపంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు.

అయితే.. నిందితుడు సల్మాన్‌పై పోలీసులు ఇప్పటికే రూ.30 వేల బహుమతి ప్రకటించారు. దీంతో భోపాల్‌లోని గాంధీనగర్‌ వార్డ్ నంబర్ 11లో ఒక టీ స్టాల్ వద్ద సల్మాన్‌ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీ తాగడానికి స్టాల్‌కు వచ్చిన సల్మాన్‌ను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత, గాంధీనగర్ పోలీసులు సల్మాన్‌ను గోహర్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. గోహర్‌గంజ్ పోలీసులు నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. దారిలో వారి వాహనం పంక్చర్ అయింది. పోలీసులు దిగి సరి చేస్తుండగా.. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. నిందితుడి కాలుకు బుల్లెట్ గాయం అయింది. అక్కడి నుంచి భోపాల్‌లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలికకు తక్షణ శస్త్రచికిత్స జరిగింది. ఆమె శరీరం తీవ్రంగా గాయ పడింది. అనేక సంక్లిష్ట చికిత్సలు జరిగాయి. బాలిక పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు.

Tags:    

Similar News